సినీ ఇండస్ట్రీలో సినిమా అనేది ముందుకు పోవాలి అంటే ముందుగా ఒక మంచి స్టోరీ ఉండాలి. అదే కనుక లేకపోతే అసలు సినిమా అనేది పట్టాలెక్కదు.మంచి కథ రాయాలంటే అంతకుమించి ఆలోచించే రచయిత దొరకాలి అలాంటి వాళ్ళలో పరుచూరి బ్రదర్స్ మొదటి స్థానంలో ఉంటారు. ఇప్పటివరకు 330 కి పైగా సినిమాలకు కథ మాటలు అందించిన వీళ్లు ఇప్పటికీ కూడా సినిమాకి సంబంధించిన ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నారు. పరుచూరి బ్రదర్స్ లో పెద్దాయన పరుచూరి వెంకటేశ్వరరావు వయసు మీద పడడంతో ఎటు వెళ్లకుండా ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ పరుచూరి గోపాలకృష్ణ మాత్రం తనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను అనుభవాలను చెప్పుకొస్తున్నారు.
అందులో భాగంగానే ఆయన వాళ్ళ అన్నయ్య వెంకటేశ్వరరావు వల్లే చాలా ఆస్తులు పోగొట్టుకున్నానని తెలిపారు. అసలు విషయంలోకి వెళితే రైటర్స్ గా బిజీగా ఉన్న రోజుల్లోనే పరుచూరి గోపాలకృష్ణ గారు శోభన్ బాబుతో ఒక సినిమా చేశారు. అది సెట్స్ మీద ఉన్నప్పుడే ప్రొడ్యూసర్ అయిన రామానాయుడు సురేష్ బాబు ఇద్దరూ కూడా సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కూడా అయింది. వాళ్ళు చెప్పినట్టుగానే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది.
ఇక చాలామంది ప్రొడ్యూసర్లు వీళ్ళ ఇంటి వద్దకు వచ్చి ఎదురుగా ఉన్న టేబుల్ పైన అడ్వాన్సులు ఇచ్చి వెళ్లేవాళ్లు. అప్పుడు పరుచూరి గోపాలకృష్ణ గారితో సురేష్ బాబు డబ్బులు తీసుకొని శంకర్పల్లి సైడ్ భూములు కొనండి అని చెప్పారట. కానీ పక్కనే ఉన్న వెంకటేశ్వరరావు వాడు డైరెక్టర్ అయితే నేనేం చేయాలి ఫిడెల్ వాయించుకోవాలని అనడంతో గోపాలకృష్ణ ఆ డబ్బులు తీసుకోలేదట . ఇక అవి గనుక కొనుక్కొని ఉంటే ఇప్పుడు నా దగ్గర రూ.100 కోట్ల మీద ఆస్తులు ఉండేవని గోపాలకృష్ణ వెల్లడించారు.