జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడికి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రదాడి నుండి 11 మందిని కాపాడాడు కాశ్మీరీ వ్యాపారి నజాకత్ అలీ. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శివాంశ్ జైన్, అరవింద్ అగర్వాల్, హ్యాపీ వాధవన్ మరియు కుల్దీప్ స్థపక్‌ల కుటుంబ సభ్యులు 11 మంది విహారయాత్రకు పహల్గాంకు వెళ్లారు.

అక్కడ వారికి పరిచయం ఉన్న స్థానిక బట్టల వ్యాపారి నజాకత్ అలీ అక్కడి ప్రదేశాలు చూపిస్తుండగా ఉగ్రదాడి జరిగింది. స్థానికుడైన నజాకత్ అలీ చాకచక్యంగా ఉగ్రదాడి నుండి తప్పించి, తనకు తెలిసిన సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లి 11 మందిని కాపాడాడు.
ఇది ఇలా ఉండగా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఢిల్లీలో ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ ఉంటుంది. ఈ మేరకు అన్ని పార్టీలకు ఆహ్వానం పలికారు రాజ్నాథ్ సింగ్. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై కేంద్రం తీసుకున్న నిర్ణయం పై చర్చించే అవకాశం ఉంది.