తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఇవాళ దర్శనాలకు 12 గంటల సాయం పడుతోంది. తిరుమలలో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు సుమారు 12 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. 9 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

నిన్న ఒక్క రోజే 68,705 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 25,382 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా వచ్చిన ఆదాయం రూ.3.62 కోట్లుగా నమోదైందని టీటీడీ అధికారులు తెలిపారు.