రేపు OTTలోకి ‘పఠాన్’ మూవీ

-

ఐదేళ్ల తర్వాత బాలీవుడ్ బాద్​షా కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈసారి చాలా స్ట్రాంగ్​గా దూసుకొచ్చాడు. రోజురోజుకు కుదేలైపోతున్న బాలీవుడ్ బాక్సాఫీస్​కు పఠాన్ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఏకంగా బాహుబలి రికార్డులను తిరగరాసింది. జనవరి 25న ప్రేక్షకులు ముందుకు వచ్చిన పఠాన్ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. దీపిక అందాలు.. షారుక్ యాక్షన్​కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

పఠాన్​ మూవీ హక్కులను ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ సినిమా రేపటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించాడు. జాన్‌ అబ్రహం కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను యష్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news