151 మందికి సీట్లు..దమ్ముందా? టీడీపీ-జనసేన రివర్స్ ఎటాక్!

-

ఏపీ రాజకీయాల్లో జగన్ గాని, వైసీపీ నేతలు గాని..టి‌డి‌పి-జనసేనలని టార్గెట్ చేసుకుని పదే పదే ఒక సవాల్ చేస్తున్న విషయం తెలిసిందే. అది ఏంటంటే..టి‌డి‌పి గాని, జనసేన గాని దమ్ముంటే 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయగలవ అని సవాల్ చేస్తున్నారు. అంటే ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయాలనేది వైసీపీ కాన్సెప్ట్ తాము 175 స్థానాల్లో ఒంటరిగా బరిలో దిగుతామని వైసీపీ చెబుతుంది.

అలాగే టి‌డి‌పి-జనసేన సైతం ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు. ఇలా సవాల్ చేయడం వెనుక రాజకీయం చాలా ఉంది. అది ఏంటంటే..టి‌డి‌పి-జనసేన విడిగా పోటీ చేస్తేనే ఓట్లు చీలిపోయి వైసీపీకి బెనిఫిట్ అవుతుంది..గత ఎన్నికల్లో అదే జరిగింది. ఈ సారి కూడా అలాగే జరిగి తాము గెలిచి తాము అధికారంలోకి వస్తామనేది వైసీపీ కాన్సెప్ట్. కానీ వైసీపీకి చెక్ పెట్టేలా టి‌డి‌పి-జనసేన ముందుకెళుతున్నాయి.

గత ఎన్నికల మాదిరిగా విడిగా పోటీ చేసి తప్పు చేయకుండా..ఈ సారి ఎన్నికల్లో పొత్తులో పోటీ చేయడానికి టి‌డి‌పి-జనసేన రెడీ అవుతున్నాయి. పొత్తు ఉంటే వైసీపీకి చెక్ పెట్టడం సులువు. దాదాపు పొత్తు ఖాయమనే చెప్పాలి. అయితే పొత్తు ఉంటే వైసీపీకి నష్టమే. అందుకే వైసీపీ పదే పదే ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేస్తుంది. ఆ సవాల్ రివర్స్ అయ్యేలా ఉంది. ఇప్పుడు టి‌డి‌పి-జనసేన కలిసి రివర్స్ లో వైసీపీకి షాక్ ఇస్తూ కొత్త సవాల్ చేస్తున్నారు. జగన్ కు దమ్ముంటే 151 మంది ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు ఇస్తారా? అని సవాల్ చేస్తున్నారు.

ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో వారికి సీట్లు ఇచ్చే ఛాన్స్ లేదని జగన్ చెప్పేస్తున్నారు. అందరికీ సీట్లు ఇస్తే వైసీపీకే నష్టం. అందుకే టి‌డి‌పి-జనసేన మాత్రం..సిట్టింగులకు సీట్లు ఇచ్చే ధైర్యం ఉన్నప్పుడు..తమని ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేయాలని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news