పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకవైపు సినిమాలలో ఫుల్ బిజీగా ఉంటూనే మరొకవైపు రాజకీయాలలో కూడా అంతే వేగంగా దూసుకుపోతున్నారు. తాజాగా తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి బ్రో అనే సినిమా చేస్తుండగా అది ఈరోజు విడుదలయ్యి మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా మెగా అభిమానులకు ఈ సినిమా పూర్తిస్థాయిలో ఫుల్ మీల్స్ అందించిందని చెప్పాలి. ఇదిలా ఉండగా సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని వదల్లేదు అన్నట్లుగా ఆ సినిమాలో డైలాగులు చూస్తే అర్థమవుతుంది.
సాయి ధరంతేజ్ చెప్పినట్టుగానే ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఈ మధ్య సినిమాల్లో పొలిటికల్ డైలాగ్స్ కూడా పెడుతున్న విషయం తెలిసిందే. బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలో ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి డైలాగ్స్ ఉన్నాయని అప్పట్లో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా బ్రో సినిమాలో కూడా ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ఎలివేట్ చేసేలా త్రివిక్రమ్ కొన్ని డైలాగ్స్ ను రాసినట్లు తెలుస్తోంది.
అయితే ఆ డైలాగ్స్ గురించి పూర్తిగా తెలియాలి అంటే బ్రో మూవీ చూడాల్సిందే. ఇక సినిమా ఫలితం విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ మేనరిజం, టైమింగ్, డైలాగ్స్, డాన్సులు అన్నీ కూడా ఫీస్ట్ గా నిలిచాయి. పవన్ ఎనర్జీతో సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. మొత్తంగా ఫ్యామిలీతో కలిసి చూసే వాళ్లకు ఈ సినిమా మంచి ఆనందాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.