ప్రతీ నెల లో కూడా ఏదో ఓ మార్పు వస్తూ ఉంటుంది. ప్రతీ నెలలానే ఈ నెల కూడా కొన్ని మార్పులు రానున్నాయి. ఇక మరి ఆగస్టులోనే రాబోతున్న కొత్త రూల్స్ చూసేద్దాం. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ని మీరు వాడుతుంటే మీకు ఇది బ్యాడ్ న్యూస్. క్యాష్‌బాక్స్, ఇన్సెంటివ్ ఆఫర్లను తగ్గించేసింది. 2023, ఆగస్టు 12న ఇది అమల్లోకి వస్తుందట. పేమెంట్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఉండగా ఇప్పుడు దీనిని 1.5 శాతానికి మార్చేశారు. అలానే ఫ్యూయల్ పర్చేజెస్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై క్యాష్‌బ్యాక్ కూడా తీసేస్తున్నారు.
అలానే ఎస్‌బీఐ నుంచి అత్యధిక వడ్డీ ఆఫర్ చేసే ఎస్‌బీఐ అమృత్ కలశ్‌లో డిపాజిట్ చేసేందుకు ఆఖరి తేదీ 2023, ఆగస్టు 15. అలానే ఇండియన్ బ్యాంక్ నుంచి మరో స్పెషల్ రిటైల్ టర్మ్ డిపాజిట్ ప్రొడక్ట్ IND SUPREME 300 డేస్ స్కీమ్.
దీనిలో చేరేందుకు ఆగస్టు 31 వరకే ఛాన్స్. సో ఇలా వచ్చే నెల నుండి ఈ అంశాల్లో మార్పులు రానున్నాయి. ఇదిలా ఉంటే 2023, జులై 31 లోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే రూ. 5 వేల జరిమానాతో ఇప్పుడు ఆగస్టు 1 నుంచి బిలేటెడ్ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసుకోవడానికి అవుతుంది. దీని కోసం 2023, డిసెంబర్ 31 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఐడీఎఫ్‌సీ బ్యాంక్ స్పెషల్ FD పథకం అయినా అమృత్ మహోత్సవ కి కూడా ఆగస్టు 15 లాస్ట్ డేట్.