తాజా ఫోటోలతో కన్ఫ్యూజన్ లో పడేసిన పవన్ కళ్యాణ్..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంతటి క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక పొలిటికల్ గా ఒకవైపు బిజీగా ఉంటూనే.. మరొకవైపు సినిమాలలో బిజీగా ఉన్నారు అయితే గడిచిన కొద్ది రోజుల నుండి ఎక్కువగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ తో సినిమాలకు కమిట్మెంట్ అయినా దర్శక నిర్మాతల సైతం కాస్త నిరుత్సాహంతో ఉన్నారని సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ లుక్కుతో మరొకసారి కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు అని చెప్పవచ్చు వాటి గురించి తెలుసుకుందాం.

ఇక పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలాగే దర్శక నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక గడిచిన కొద్దిరోజుల క్రితం ఎక్కువగా పొలిటికల్ వైపు ఉండగా.. ఇప్పుడు తాజాగా మళ్లీ సినిమాల వైపు తన మనసు మల్లింది అన్నట్లుగా అందుకోసం తన గెటప్ కూడా మార్చేశారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాతో పాటు తను నటించబోతున్న భవ దీయుడు భగత్ సింగ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక చిత్రం.. మరో ఇద్దరు దర్శకులతో తన సినిమాలను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

ఇక హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కేవలం ఒక నెల రోజులు మాత్రమే పూర్తి చేస్తే సినిమా పూర్తి అవుతుంది. కానీ ఇందుకోసం పవన్ కళ్యాణ్ తన డేట్ లను ఈ నెలలో ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా వచ్చిన ఫోటోలతో పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలను నటించేందుకే ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నిన్న మొన్నటి వరకు ఉన్న లుక్కు కాకుండా చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఇక ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ కచ్చితంగా మళ్ళీ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారని అర్థమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news