Unstoppable 2 : అన్నయ్య తుపాకీతో కాల్చుకుందామనుకున్నా: పవన్ కల్యాణ్

-

నందమూరి బాలకృష్ణ హోస్టు చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే షో హై రేటింగ్స్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ షోలో సూపర్ స్టార్స్, ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ మొదటి ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అయింది. తాజాగా రెండో ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేసింది ఆహా. ఈ ప్రోమో చూస్తుంటే పవన్ తన లైఫ్ లో జరిగిన కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది.

చిన్నప్పటి నుంచి ఆస్తమా, జ్వరం ఉండేవి. ఆరు, ఏడో తరగతుల్లో ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. సరైన స్నేహితుల్లేక ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చేది. పుస్తకాలే స్నేహితులుగా గడిపాను. పాఠశాల, కళాశాలకు వెళ్లడం ఇబ్బందిగా అన్పించేది. పరీక్షల ఒత్తిడి నచ్చేది కాదు. ఆ క్రమంలో ఉపాధ్యాయులూ నచ్చేవాళ్లు కాదు. సెల్ఫ్‌ లెర్నింగ్‌లో నడిచాను. స్నేహితులంతా ఉన్నత చదువులు, క్రికెట్‌లో రాణిస్తున్న వేళ నేను పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాను. ఆత్మన్యూనతాభావం ఉండేది. 17 ఏళ్ల వయసులో మానసికంగా కుంగిపోయా. చనిపోతే బాగుండు అన్పించింది. అన్నయ్య లైసెన్స్‌ రివాల్వర్‌ తీసుకుని కాల్చుకుందామనుకున్నా. సురేఖ వదిన, నాగబాబు అన్నయ్య గమనించి ఎందుకలా ఉన్నావని అడిగారు. కాల్చుకుందామనుకుంటున్నా అని చెప్పడంతో వారు చిరంజీవి అన్నయ్య దగ్గరకు తీసుకెళ్లారు. పరీక్షలపై దిగులుతో ఇలా ప్రవర్తిస్తున్నానని చెప్పారు. నువ్వేం చదవకపోయినా పర్లేదు, బతికి ఉండరా అని చెప్పారు.’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news