‘బ్రో’ కోసం పవన్‌ కల్యాణ్ ఉపవాసం ఉన్నారు : సముద్రఖని

-

‘బ్రో’ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉపవాసం చేశారని ఆ చిత్ర దర్శకుడు, నటుడు సముద్రఖని తెలిపారు. మూవీ కోసం పవన్‌ ఎంతో కష్టపడి పని చేశారని చెప్పారు. సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా పవన్‌ కీలక పాత్రలో రూపొందిన ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ రీమేక్‌గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జులై 28న విడుదల కానున్న నేపథ్యంలో మీడియాకు డైరెక్టర్ సముద్రఖని ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

త్రివిక్రమ్ సాయంతో బ్రో సినిమా చేయగలిగానని.. కథ చెప్పినప్పుడు క్లైమాక్స్ డైలాగ్స్ బాగా నచ్చాయని సముద్రఖని అన్నారు. ఈ కథని ఎక్కువ మందికి చేరువ చెయ్యాలని, పవన్ తో చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ చెప్పగానే ఒక్కసారిగా మాటల్లో చెప్పలేని ఆనందం కలిగిందని తెలిపారు. కాలమే త్రివిక్రమ్, పవన్‌కల్యాణ్‌లను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చిందని.. మాతృకలోని ఆత్మను తీసుకుని, పవన్‌ స్టార్‌డమ్‌కు అనుగుణంగా మార్పులు చేశామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version