ప‌వ‌ర్ స్టార్ ఈజ్ బ్యాక్‌.. కాంబినేష‌న్ కుదిరింది..

-

రాజకీయాల నేపథ్యంలో సినిమాలకు దూరంగా ఉన్న జనసేనా అధినేత‌ పవన్ కల్యాణ్… త్వరలోనే కొత్త సినిమా చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమా అధికారికంగా ఖ‌రారైంది. బాలీవుడ్ చిత్రం `పింక్‌`ను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. బాలీవుడ్‌లో అమితాబ్ చేసిన లాయ‌ర్ పాత్ర‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించ‌నున్నారు.

ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్‌, టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. `ఓ మై ఫ్రెండ్‌`, `ఎంసీఏ` చిత్రాల ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ సినిమాను డైరెక్ట్ చేయ‌న్నారు. 2018లో విడుద‌లైన `అజ్ఞాత‌వాసి` త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌లేదు. ఇక ఇప్పుడు మ‌ళ్లీ ప‌వ‌న్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండ‌టం ఆయ‌న అభిమానుల‌కు శుభ‌వార్తే.

Read more RELATED
Recommended to you

Exit mobile version