పవన్ కళ్యాణ్ సంక్రాంతికి ట్రీట్ ఇవ్వనున్నాడా..?

-

రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, వకీ,ల్ సాబ్ సినిమాతో సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ లో సక్సెస్ సాధించిన పింక్ సినిమాని తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రీకరణ పూర్తయ్యింది. దాంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. 2021 ఏప్రిల్ 9వ తేదీన వకీల్ సాబ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారట.

ఈ మేరకు అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఐతే తాజా అప్డేట్ ప్రకారం సంక్రాంతి కానుకగా వకీల్ సాబ్ టీజర్ రానుందట. పవన్ కళ్యాణ్ ని తెరమీద చూసి చాలా రోజులైన కారణంగా పవన్ అభిమానులందరూ ఆసక్తిగా ఉన్నారు. మరి సంక్రాంతికి టీజర్ వస్తుందేమో చూడాలి. దిల్ రాజు నిర్మాతగా రూపొందిన ఈ సినిమాని వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version