పవన్ రెండు కాదు…. మొత్తం నాలుగా….??  

-

టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం బాలీవుడ్ మూవీ పింక్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ సరసన ఒక స్టార్ హీరోయిన్ నటించబోయే ఈ సినిమాకు యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు, బోనీ కపూర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ హీరోగా కొన్నాళ్ల క్రితం వచ్చిన కోర్ట్ డ్రామా పింక్ అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఎస్ ఎస్ థమన్ తొలిసారిగా ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే రెండు సాంగ్స్ కంపొజీషన్ పూర్తి అయిందని,

తప్పకుండా సాంగ్స్ పవన్ గారి ఫ్యాన్స్ కు నచ్చుతాయని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో థమన్ చెప్పడం జరిగింది. ఇటీవల షూటింగ్ మొదలైన ఈ సినిమాని మే లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఛాన్స్ కనపడుతోంది. ఇకపోతే దీని తరువాత పవన్ కళ్యాణ్, క్రిష్ ల కాంబోలో తెరకెక్కబోయే సినిమా ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మితం కానుంది. ప్రముఖ కోలీవుడ్ నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మించనున్న ఈ సినిమాను ఒక పీరియాడికల్ మూవీ గా క్రిష్ తెరకెక్కించనున్నాడు. ఇటీవల పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాను రాబోయే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఛాన్స్ ఉంది. ఇకపోతే వీటి తరువాత ఇకపై పవన్ సినిమాల్లో నటించరని కొద్దిరోజులుగా ఒక వార్త ప్రచారం అవుతున్నప్పటికీ,

 

అదేమి లేదని వీటి తరువాత ఆయన మరొక రెండు సినిమాల్లో నటించనున్నారని అంటున్నారు. ఈ రెండింటి అనంతరం గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో ఒక సినిమాలో ఆయన నటిస్తున్నట్లు కాసేపటి క్రితం ప్రకటన వచ్చింది.  అలానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరొక సినిమాని పవన్ చేయనున్నారని, మొత్తంగా దీనిని బట్టి మొత్తంగా నాలుగు సినిమాల్లో వరుసగా పవన్ నటిస్తారని నేడు టాలీవుడ్ వర్గాల్లో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం, పవన్ ఫ్యాన్స్ కి ఇది మంచి పండుగ వార్తే అని చెప్పవచ్చు……!!

Read more RELATED
Recommended to you

Exit mobile version