పోలీస్‌ డ్రెస్‌లో పవర్​స్టార్​.. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ ఫొటో వైరల్

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఓవైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇటీవలే బ్రోతో బాక్సాఫీస్ షేక్ చేసిన పవన్.. మరో మూడు సినిమాలతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. వాటిలో ఒకటి ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ . హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయిక. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.

పవన్‌ కల్యాణ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్ సాయి మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సెట్‌లో పవన్‌తో నడుస్తున్న ఫొటోను ఆయన షేర్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా #UstaadBhagatSingh ట్రెండింగ్‌లోకి వచ్చింది. ‘ఈ షెడ్యూల్ ఎన్ని రోజులు చేస్తారు’, ‘ఈ ఫొటో ఎప్పుడు తీయించుకున్నారు?’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమాలో బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ కొట్టిన పవన్‌ – హరీశ్‌శంకర్‌ల కాంబోలో .. సుమారు 11 ఏళ్ల తర్వాత ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ కోసం వర్క్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news