ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలి – ఏపీఎన్జీవో అధ్యక్షుడు

-

అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని అన్నారు ఏపీఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు. నేడు ఏపీ ఎన్జీవోలు నిర్వహించిన మహాసభలో భాగంగా బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ సుప్రీంకోర్టు లో ఉందని గత ప్రభుత్వం చెప్పిందని.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసి, కటాఫ్ డేట్ లిమిట్ కూడా మా వినతితో తొలగించారని అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని సీఎం ను కోరుతున్నామన్నారు.

కాంట్రాక్టు ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతం వచ్చేలా చేసిన ఘనత సీఎం జగన్ దేనని అన్నారు. జీపీఎస్ విధానానికి ఏపీఎన్జీఓ ఆమోదం తెలుపుతోందన్నారు. 11వ పీఆర్సీ తో ఉద్యోగులకు అన్యాయం జరిగితే 12 వ పీఆర్సీ కూడా ఇవ్వాలన్నారు. రెండు డిఏలు బకాయిలు ఉన్నాయని… ఒక డిఏ ఇవాళ ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్ కు కూడా 62 సంవత్సరాలు రిటైర్మెంట్ పరిధిగా చేయాలని కోరుతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news