తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజ్‌నేవా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్.. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సింగపూర్ లోని ప్రముఖ స్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో.. చిక్కుకున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్…. తీవ్ర గాయాల పాలయ్యాడు. అగ్ని ప్రమాదం కావడంతో పొగ మొత్తం తన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళింది.

అయితే ఈ ప్రమాద విషయం తెలియగానే వెంటనే సింగపూర్ వెళ్లారు పవన్ కళ్యాణ్ దంపతులు. అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలియగానే… తాజాగా ఇంటికి తీసుకువచ్చారు. ఈ తరుణంలోనే తన కొడుకు ప్రాణాలతో బయటపడడంతో తిరుమల శ్రీవారికి మొక్కలు చెల్లించారు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజ్‌నేవా. సందర్భంగా తలనీలాలు కూడా ఇచ్చారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.