ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా కుర్ర కారు హృదయాలను తన వైపు తిప్పుకున్న పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే.. తాజాగా తనకు న్యాయం చేయాలంటూ X వేదికగా ఒక ట్వీట్ చేసింది పాయల్.
2019-20 ఏడాది సమయంలో రక్షణ అనే సినిమా ఒప్పుకున్నానని….అయితే ఆ సినిమాకి ముందు 5Ws అనే టైటిల్ అనుకున్నారని తెలిపింది. అయితే కొన్ని కారణాలవల్ల సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చిందని….కానీ ఇటీవల తనకు సక్సెస్ రావడంతో ఆ క్రేజ్ ని వాడుకొని మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని పేర్కొంది.
నా రీసెంట్ సక్సెస్ చూసి ఇప్పుడు రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అగ్రిమెంట్ ప్రకారం నా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు. ప్రమోషన్స్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. రాకపోతే బ్యాన్ చేస్తాం అంటున్నారు. ఈ మూవీలో నా పేరు, పాత్ర ఉంటే చట్టపర చర్యలు తప్పవు అని Xలో ఆమె పోస్ట్ చేశారు.