చీర – చిరునవ్వులు.. నాకు ఇంకేం కావాలన్నారు స్టార్ హీరోయిన్ పాయల్. ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా కుర్ర కారు హృదయాలను తన వైపు తిప్పుకున్న పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.
అయితే స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలకు ‘చీర – చిరునవ్వులు.. నాకు ఇంకా ఏమి కావాలి’ అనే క్యాప్షన్‌ను జోడించారు. నీలం రంగు చీరలో సింపుల్‌గా కనిపిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్స్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.