తెలంగాణలో ఇవాళ అర్ధరాత్రి నుంచి ‘భరోసా’ డబ్బులుపడనున్నాయి.తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోయే రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించిన డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలో అర్ధరాత్రి నుంచి జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు.

నేడు ఆదివారం సెలవు కావడంతో అర్ధరాత్రి 12 గంటల తర్వాత లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ కానున్నట్లు అధికారులు తెలిపారు. పంట సాగు చేస్తున్న రైతులకు ఎకరాకు రూ. 6వేలు, భూమి లేని వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు రూ.6వేలను అకౌంట్లలో వేయనున్నారు.