రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే ఎలా కనిపించబోతుందో తెలుసా..?

-

ప్రభాస్ హీరోగా నటిస్తున్న పిరియాడిక్ రొమాంటిక్ డ్రామా అయిన ‘రాధేశ్యామ్’ కి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయ్యిందన్న సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ లో కొత్తగా ఏమీ లేదని అభిమానులు నిరాశ పడ్డారు, అది వేరే విషయం అనుకోండి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తి రేపుతుంది.

ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా… ఆమె చాలా సాంప్రదాయకమైన మ్యూజిక్ టీచర్ గా కనిపించబోతుందని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటివరకు చిట్టి పొట్టి డ్రెస్సులు వేసి సినిమాల్లో తన అందాలను ఆరబోసిన పూజా హెగ్డే ప్రభాస్ సినిమాలో మాత్రం చాలా సాంప్రదాయంగా, గ్లామర్ షో చేయకుండా కనిపించబోతుందట. ఈ సినిమాకి దర్శకుడు అయిన రాధాకృష్ణ పూజా హెగ్డే ని సరికొత్త అవతారంలో చూపించనున్నాడని తెలుస్తుంది. అల వైకుంఠపురములో సినిమా ద్వారా భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే ప్రభాస్ సరసన నటించి ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చూడాలిక.

Read more RELATED
Recommended to you

Latest news