ఆ హీరోకి లిప్ లాక్ ఇవ్వాలనుకున్నా… పూజా హెగ్డే

-

లిప్ లాక్ ” ఈ రోజుల్లో సినిమాల్లో ఇది కామన్ అయిపోయింది. సినిమాలో ఏదోక సందర్భంలో ఆ సీన్ ఉండటం తప్పనిసరిగా మారిపోయింది. అభిమానులు కూడా వాటిని కోరుకోవడంతో దర్శక నిర్మాతలు కూడా వాటి కోసమే కథలను సిద్దం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. గతంలో బాలివుడ్ కి మాత్రమే పరిమితం అయిన ఈ లిప్ లాక్ సీన్లు ఇప్పుడు అన్ని భాషలకు పాకాయి. అన్ని సినిమాల్లో కాకపోయినా కొన్ని సినిమాల్లో మాత్రం వాటికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది అత్యవసరంగా మారిపోయింది.

ఇక హీరో హీరోయిన్లు కూడా వాటికి ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు. అందరు హీరోయిన్లు కాకపోయినా కొందరు హీరోయిన్లు మాత్రమే వీటికి ఓకే చెప్తున్నారు. దీనిపై పూజా హెగ్డే ఒక కీలక విషయం చెప్పింది. హృతిక్ రోషన్ తో ఒక సీన్ లో ముద్దు పెట్టడానికి చాలా భయపడినట్టు ఈ భామ చెప్పుకొచ్చింది. ‘మొహంజోదారో’ సినిమాలో ముద్దుపెట్టిన సీన్‌ను గుర్తు చేసుకుంటూ ఆమె ఒక కీలక విషయాన్ని చెప్పింది.

ముద్దు సన్నివేశాలు వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులకు బాగుంటాయి. కానీ.. ఆ సీన్‌‌లలో నటించేందుకు నటులు చాలా కష్టపదతారని, ఆ సినిమాలో హ్రితిక్ తో లిప్ లాక్ సీన్ ఉందని షూట్‌కు ముందు దర్శకుడు అశుతోష్‌ గోవారికర్‌ తనకు వివరించారని, దాంతో లిప్ లాక్ కి సిద్దమయ్యా అని కాని షూట్ చేసే సమయానికి మాత్రం తనకు వణుకు వచ్చిందని, అంతకు ముందు తాను ఎప్పుడు అలాంటి సీన్లు చేయలేదని ఆమె వివరించింది. తమ చుట్టూ జనాలు ఉన్నారని తనకు చాలా కష్టంగా అనిపించిందని చెప్పుకొచ్చింది ఈ పొడుగు కాళ్ళ సుందరి.

Read more RELATED
Recommended to you

Latest news