ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్నా.. అన్ని అవార్డ్స్ ని సొంతం చేసుకున్న పూజా హెగ్డే..!

-

పూజా హెగ్డే.. బుట్ట బొమ్మగా గుర్తింపు తెచ్చుకున్న ఈ పొడుగు కాళ్ళ సుందరికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు యూత్ ఐకాన్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది పూజా హెగ్డే.. కేవలం తన సినిమాలతోనే కాకుండా గ్లామర్ షో తో కూడా మరింత రచ్చ చేస్తూ ఉంటుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించింది . ఇక పోతే గత కొన్ని రోజుల క్రితం వరుస విజయాలను సొంతం చేసుకున్న ఈమె ఉన్నట్టుండి వరుస ప్లాప్ ల బాట పట్టిందని చెప్పవచ్చు.

ఎందుకంటే ఆమె నటించిన మూడు సినిమాలు వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్ అందుకోవడంతో అందరూ ఈమెను ఐరన్ లెగ్ అని పిలవడం మొదలుపెట్టారు. నిజానికి చిరంజీవి , రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమాలో నటించిన పూజా హెగ్డే ఆ సినిమాతో డిజాస్టర్ ను మొదటిసారి మూటగట్టుకుంది. ఇక ఆ తర్వాత విజయ్ హీరోగా వచ్చిన బీస్ట్ సినిమా కూడా డిజాస్టర్ పాలయ్యింది. ఇక మూడోసారి పాన్ ఇండియా సినిమా ప్రభాస్ సరసన రాధే శ్యామ్ సినిమాలో కూడా నటించింది. కనీసం ఈ సినిమా నైనా ఈమెకు స్టార్ ఇమేజ్ ను తెచ్చి పెడుతుందని అందరూ అనుకున్నారు కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఇక ఈమెను ఐరన్ లెగ్ అని పిలవడం మొదలుపెట్టారు.

ఇకపోతే వరుస స్లాప్ లను మూటగట్టుకున్నా సరే అవకాశాలు మాత్రం వరుసగా వస్తున్నాయి. ఇక ఇటీవల మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరొకవైపు విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రాబోయే జనగణమన సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాలపరంగా అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ ఈసారి ఈమెకు రెండు సైమా అవార్డులు లభించడం గమనార్హం. ఒకటి అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో నటించిన అందుకు బెస్ట్ యాక్టర్ గా ఒక సైమా అవార్డును సొంతం చేసుకోగా.. మరొకటి యూత్ ఐకాన్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇలా రెండు సైమా అవార్డులను సొంతం చేసుకోవడంతో ఈమె తెగ మురిసిపోతూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఇవి కాస్త నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version