పూజా హెగ్దెని వదలని త్రివిక్రం..!

-

దర్శకులందరు త్రివిక్రం వేరయా అనుకుంటున్నట్టుగానే తన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త ఎలిమెంట్ ఉండేలా చూసుకునే త్రివిక్రం హీరోయిన్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాడు. తన సినిమాల్లో నటించే హీరోయిన్ ఏ భాష అమ్మాయైనా సరే తెలుగు డబ్బింగ్ చెప్పాల్సిందే. అజ్ఞాతవాసి కోసం కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ ఇద్దరి చేత ఓన్ డబ్బింగ్ చెప్పించిన త్రివిక్రం ప్రస్తుతం చేస్తున్న అరవింద సమేత సినిమాలో హీరోయిన్ ను కూడా వదల్లేదట.

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా వస్తున్న అరవింద సమేత సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజానే సొంత డబ్బింగ్ చెబుతుందట. తెలుగు నేర్చుకుని మరి డబ్బింగ్ చెప్పడం విశేషం. ఎలాగు ఇక్కడ క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది కాబట్టి పనిలో పనిగా తెలుగు కూడా నేర్చుకుంటే మరిన్ని ఆఫర్లు సొంతం చేసుకోవచ్చని అమ్మడి ఆలోచన. మరి పూజా హెగ్దె తెలుగు డబ్బింగ్ ఎలా ఉంటుందో అరవింద సమేత సినిమా వస్తేనే కాని చెప్పలేం.

Read more RELATED
Recommended to you

Exit mobile version