పూనం కౌర్ ట్వీట్స్.. మళ్ళీ రచ్చ రచ్చ..!

-

టాలీవుడ్ స్టార్ హీరో విషయంలో ఎప్పుడు సంచలనం అవుతూనే ఉంది ఒకప్పటి హీరోయిన్ పూనం కౌర్. ప్రతీసారి ఇన్‌డైరెక్ట్ గా ట్వీట్స్ తో సంచలన వ్యాఖ్యలు చేసే పూనమ కౌర్ ఈ సారి ఇంకాస్త క్లారిటీగా వ్యాఖ్యలు చేసింది. ఇవి ఎవరిని ఉద్దేశించో దాదాపు అందరికి అర్థమవుతోంది. అయితే ఖచ్చితంగా మీరు అని మాత్రం ఇప్పుడు కూడా ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరం. పూనం కౌర్ గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం వస్తే అది ఆయనకి అత్యంత సన్నిహితుడు స్టార్ డైరెక్టర్ ఆ ఛాన్స్ ని పోగొట్టాడని వ్యాఖ్యలు చేసింది.

 

అంతేకాదు చాలా సందర్భాలలో కలిసి జీవితం పంచుకోవాల్సిన ఇద్దరు మీవల్లే విడిపోయారంటూ వెల్లడించింది. ప్రత్యంక్షంగా పరోక్షంగా వారిద్దరి జీవితాలు మీవల్లే నాశనం అయ్యాయని భగ్గుమనింది. ఇక తన జీవితం కూడా ఆ టాప్ డైరెక్టర్ వల్లే అబాసు పాలయిందని చాలా సందర్భాలలో వాపోయింది. తనకు వచ్చిన సినిమా అవకాశాలు రాకుండా చేశాడని గతంలో వెల్లడించింది.

ఇక ఇదే తరహాలో పూనం కౌర్ మరోసారి సంచల వ్యాఖ్యలతో చేసిన ట్వీట్స్ ఇండస్ట్రీ తో పాటు సోషల్ మీడియాలోను హాట్ టాపిక్ అవుతున్నాయి. అవకాశాలు లేక నమ్ముకున్న వాళ్ళు మోసం చేశారని మానసికంగా కృగిపోయి డిప్రషన్ లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకునే సందర్భం వచ్చినప్పటికి “నువ్వు చచ్చిపోతే కేవలం ఒక రోజు న్యూస్ అవుతావంటూ ఆ స్టార్ డైరెక్టర్ హేళన చేశాడని వాపోయింది.

అంతేకాదు ఇదే ట్వీట్ లో నీ స్నేహితుడిని అతని భార్య పిల్లల దగ్గరికి వెళ్ళకుండా చేశావు. ఇప్పుడు వాళ్ళు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారంటూ వ్యాఖ్యలు చేసింది. మొత్తంగా పూనం కౌర్ ఈ వ్యాఖ్యలు చేసింది పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ల గురించి వాళ్ళ జీవితం చిన్నా భిన్నం చేసిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version