మలయాళ కుట్టి షామ్నా ఖాసిమ్ అలియాస్ పూర్ణ..ఓ వైపు బుల్లితెర మరో వైపు వెండితెర రెండిటిపైనా సందడి చేస్తోంది. ‘ఢీ’షోతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన ఈ సుందరి..ఇటీవల బాలయ్య ‘అఖండ’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఆమె పాత్రకు చక్కటి ప్రశంసలు దక్కాయి. ఇక ఈ సుందరి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
పూర్ణ తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. చీరకట్టులోనూ పూర్ణ మత్తెక్కిస్తున్నదని ఫొటోలు చూసిన నెటిజన్లు అంటున్నారు. నీలి రంగు చీరలో పూర్ణ..తగు ఆభరణాలు ధరించి చింగులు సరి చేసుకుంటూ, అలా ఓరగా చూస్తూ నిలబడి, నడుముపై చేయి వాల్చి రకరకాల ఫోజులిచ్చింది.
నడుము ఒంపు చూపి పూర్ణ మత్తెక్కిస్తున్నదని ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు అంటున్నారు. నాకు ఇష్టమైనది ‘శారీ’ అని క్యాప్షన్ ఇచ్చి తన ఫొటోలు షేర్ చేసింది పూర్ణ. కంప్లీట్ బ్లూకలర్ శారీలో ..ఫుల్ బ్లౌజ్ ధరించి మెడ ఆభరణంతో పూర్ణ లుక్ అదిరిపోయింది.
‘యూ ఆర్ స్టన్నింగ్ ఇన్ శారీ…బ్యూటిఫుల్, ఐలవ్ యూ, ఏంజెల్, సూపర్బ్’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఫొటోను నెటిజన్లు లైక్ చేస్తూనే ఉన్నారు. పూర్ణ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది.