Naga Chaitanya : ‘NC23’ నుంచి పోస్టర్ రిలీజ్

-

టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య గురించి తెలియని వారుండరు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య గతేడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా నాగచైతన్య మరో హీరోయిన్ శోభితా ధూలిపాళతో డేటింగ్‌లో ఉన్నారంటూ పుకార్లు వస్తున్నాయి. ఈ ఇద్దరూ రెండు మూడు సార్లు కలిసి కనిపించడంతో వీటికి మరింత బలం చేకూరింది. వీరి డేటింగ్ రూమర్లపై సమంత వ్యాఖ్యలు చేసినట్టుగా ఓ మీడియా రాసింది.

NagaChaitanya
NagaChaitanya

ఇది ఇలా ఉండగా.. నాగచైతన్య అక్కినేని హీరోగా ‘NC23’ వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కనుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపే ఓ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని చందు మొండేటి తెరకెక్కించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మించనుంది. ఉపాధి కోసం సముద్ర వేట చేస్తూ పాకిస్తాన్ కోస్టుగార్డులకు చిక్కిన మత్స్యకారుల ఇతివృత్తంతో ఈ మూవీ రూపొందిస్తున్నారు. సినిమాలోని పాత్ర కోసం చైతు మేకోవర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news