నెట్టింట తప్పుడు ప్రచారం కాదు.. ప్రజాక్షేత్రంలో ధర్మ యుద్ధం చేయాలి : మంత్రి పువ్వాడ

-

సోషల్ మీడియాలో కొంత మంది బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రత్యర్థులు చిల్లర రాజకీయాలకు తెర తీస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో ధర్మం యుద్ధం చేసి ఈ ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు.

ఖమ్మం నగరంలోని 4వ డివిజన్​లో ఇవాళ పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజీవ్‌ నగర్‌ గుట్టలో ఇంటింటికి వెళ్లి కేసీఆర్ భరోసాను ప్రజలకు వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థించారు. నగరంలో ప్రత్యర్థి పార్టీలు అబద్దపు ప్రచారాలకు తెరతీశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన కార్పొరేటర్‌ మిమిక్రీ అర్టిస్టుతో ఓ ఆడియో చేయించి ఖమ్మం నగరంలో వైరల్‌ చేస్తున్నారని అజయ్ ధ్వజమెత్తారు. ఏదైనా ఉంటే ధర్మ యుద్ధం చేయాలని.. ప్రజాక్షేత్రంలో తెల్చుకోవాలని సూచించారు. ఖమ్మం నగరంలో ఈ తొమ్మిదన్నరేళ్లలో జరిగిన అభివృధ్ధిపై చర్చ జరగాలని అన్నారు. ఈ అభివృద్ధిని గుర్తించి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని పువ్వాడ అజయ్ కుమార్ అభ్యర్థించారు.

Read more RELATED
Recommended to you

Latest news