power of ghani : వ‌రుణ్ తేజ్ గ‌ని నుంచి అదిరిపోయే అప్ డేట్

-

మెగా హీరో వ‌రుణ్ తేజ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా గ‌ని సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్ ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ప‌వ‌ర్ ఆఫ్ గ‌ని అనే పేరుతో ఒక ప్ర‌త్యేక మైన వీడియో ను విడుద‌ల చేసింది. అలాగే మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపింది. కాగ ఈ వీడియో లో వ‌రుణ్ తేజ్ రింగ్ లో ప్ర‌త్య‌ర్థుల‌పై పంచ్ వేస్తు బాక్స‌ర్ గా క‌నిపిస్తున్నాడు.

28 సెక‌న్లు మాత్ర‌మే ఉన్న ఈ వీడియో వ‌రుణ్ తేజ్ పంచ్ ల వ‌ర్షం క‌నిపిస్తుంది. చివ‌ర్లో సీరియ‌స్ లుక్ లో ఉన్న వ‌రుణ్ తేజ్ ను చూస్తే.. నిజ‌మైన బాక్స‌ర్ ల కనిపిస్తున్నాడు. కాగ వ‌రుణ్ తేజ్ హీరో గా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో గ‌ని సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా లో జ‌గ‌ప‌తి బాబు, సునీల్ శెట్టి, ఉపెంద్ర‌, న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. అలాగే సాయి మంజ్రేక‌ర్ హీరోయిన్ గా నటిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version