యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సుజిత్ దర్శకత్వంలో రూపొందించిన `సాహో` చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ యాక్షన్ థిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించింది. దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఒకే సారి విడుదల కానుంది. ప్రస్తుతం జోరుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రమోషన్లు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే ప్రభాస్.. అనుష్కపై సంచలనమైన కామెంట్లు చేశాడు. ఇంకా సినిమా విడుదల కావడానికి మూడు రోజులు మాత్రమే ఉండడంతో ప్రభాస్ నిన్న మొత్తం తెలుగు ఛానెల్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ రాపిడ్ పైర్ టాస్క్‌లో అనుష్కలో తనకు నచ్చని విషయాలు మరియు నచ్చిన విషయాలు చెప్పాడు. ప్రభాస్‌కు అనుష్కలో స్వీట్ అండ్ పాజిటివ్, టాల్, బ్యూటిఫుల్ తనకు నచ్చుతాయని.. ఫోన్ ఎత్తకపోవడం తనలో నాకు నచ్చని విషయమని చెప్పాడు.
వాస్తవానికి అనుష్కపై అందరికి ఉన్న కంప్లైంట్ ఫోన్ ఎత్తకపోవడం ఒక్కటే ఉంటుందని ప్రభాస్ చెప్పారు. ఎవరు ఫోన్ చేసినా సరిగ్గా ఫోన్ ఎత్తదని ఆయన చెప్పారు. అయితే ప్రభాస్ అండ్ అనుష్క కాంబినేషన్ అంటేనే ఏదో తెలియని వైబ్రేషన్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే వీరి బంధంపై ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ నిన్న జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాటలతో ఆ పుకార్లకు చెక్ పెట్టినట్టు అనిపిస్తుంది.