రూ. 20కే అకౌంట్‌ & ఏటీఎం కార్డ్‌

-

20 రూపాయిల‌తో అకౌంట్‌ అండ్ ఏటీఎం కార్డ్‌.. విచిత్రంగా ఉంది క‌దూ.. వాస్త‌వానికి బ్యాంకులతో ప్ర‌జ‌లు విసికి విసికి వ్యాసారిపోతున్నారు. దీనిక‌న్నా పోస్టాఫీస్ అకౌంట్ మేలంటున్నారు. పోస్టాఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ ప్రారంభించాలంటే కేవలం రూ. 20 ఉంటే సరిపోతుంది. భద్రతకు ఎలాంటి ఢోకా లేని పోస్టాఫీస్ సేవీంగ్స్ అకౌంట్‌లో డబ్బు డిపాజిట్ చేయడం వల్ల ఎక్కువ వడ్డీ పొందొచ్చు.


పోస్టాఫీస్‌లో పొదుపు ఖాతా తెర‌వొచ్చు. సంవ‌త్స‌రానికి 4 శాతం వడ్డీ పొందొచ్చు. అలాగే చెక్ బుక్ ఫెసిలిటీ మ‌రియు ఏటీఎం కార్డు సేవ‌లు కూడా మ‌న‌కు ల‌భిస్తాయి. ఈ సేవింగ్స్ అకౌంట్ వ‌ల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేయండి..

– అకౌంట్‌ను ఒక పోస్టాఫీస్ నుంచి మరొక పోస్టాఫీస్‌కు మార్చుకోవచ్చు. మ‌రియు అకౌంట్ పై పొందిన వడ్డీపై పన్ను మినహాయింపు ఉంది. ఏడాదిలో రూ. 10,000 వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు.

– నగదు రూపంలో డబ్బులిచ్చి అకౌంట్‌ను ప్రారంభించొచ్చు. ఒక పోస్టాఫీస్‌లో ఒకే అకౌంట్‌ని తెరవగలం.

– అకౌంట్ యాక్టివ్ గా ఉండాలంటే మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఒక్కసారైనా అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేయాలి. లేదంటే విత్‌డ్రా అయినా చేసుకోవాలి.  ఏటీఎం ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది.

– సింగిల్ అకౌంట్‌ను జాయింట్ అకౌంట్‌గా.. జాయింట్ అకౌంట్ సింగిల్ అకౌంట్‌గా మార్చుకోవచ్చు.  పిల్లల పేరుపై కూడా అకౌంట్ తెర‌వ‌చ్చు.

–  చెక్ బుక్  ఫెసిలిటి లేని అకౌంట్‌దారులు ఖాతాలో కనీసం రూ.50ను మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి.

–  అదే చెక్ బుక్ కలిగి ఉంటే మినిమమ్ బ్యాలెన్స్ రూ. 500 అకౌంట్‌లో కనీసం ఈ మొత్తాన్ని కలిగి ఉండాలి. ఎవరికి అవసరం అయితే వారు ఈ సేవలు పొందొచ్చు.

– ఖాతాకు నామినేషన్ సౌకర్యం కూడా ఉంది. అకౌంట్ ప్రారంభించేటప్పుడు లేదా తర్వాత అకౌంట్‌కు నామినీని చేర్చుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version