స్పిరిట్ సినిమా కు ప్ర‌భాస్ భారీ గా పారితోషికం ?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ , అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ సందీప్ వంగ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా స్పిరిట్. ఈ సినిమా కు సంబంధించి ప్ర‌భాస్ భారీ మొత్తం లో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌భాస్ ఏకంగా రూ. 150 కోట్ల పారితోషికం తీసుకుంటున్న‌ట్టు సోష‌ల్ మీడియా లో సినీ ప‌రిశ్ర‌మ లో ఈ వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది.

ఈ వార్త నిజం అయితే తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ లో అత్య‌ధిక పారితోషికం తీసుకోనున్న హీరో ప్ర‌భాస్ అవుతారు. అయితే స్పిరిట్ సినిమా పాన్ వ‌రల్డ గా తెర‌కెక్క‌నుంది. అలాగే యాక్ష‌న్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండ‌నుంది. అలాగే ఈ సినిమా లో ప్ర‌భాస్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా కనిపించ‌నున్నాడు. ఈ సినిమా షూటింగ్ వ‌చ్చే ఏడాది చివ‌ర్లో ప్రారంభం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌భాస్ రెంజ్ బహుబ‌లి సినిమా ల‌తో అమాంతం పెరిగి పోయింది. ఆయ‌న ప్ర‌స్తుతం తీస్తున్న సినిమా లు అన్ని కూడా పాన్ ఇండియా లెవ‌ల్ లోనే ఉన్నాయి.