చాలా మంది వాళ్ళ యొక్క డబ్బులని పీపీఎఫ్ లో పెట్టాలని అనుకుంటారు. పీపీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు జరిగినా పెట్టుబడి దెబ్బతింటుంది. అయితే ఏ తప్పులు చెయ్యకూడదు అనేది ఇప్పుడు మనం చూద్దాం. పూర్తి వివరాల లోకి వెళితే.. పీపీఎఫ్ ఖాతా సక్రమంగా లేనప్పుడు, అనేక సమస్యలు వస్తాయి.
రెండు అకౌంట్స్ ని ఓపెన్ చెయ్యద్దు:
పీపీఎఫ్ రూల్స్ ప్రకారం చూస్తే ఒక పేరుతో ఒక ఖాతాను మాత్రమే తెరవగలరు. ఒకవేళ మీకు బ్యాంకులో PPF ఖాతా ఉంటే, మీరు పోస్టాఫీసులో తెరవలేరు గుర్తుంచుకోండి. అలా కాదు అని రెండు ఖాతాలు తెరిస్తే ఒక ఖాతా క్లోజ్ చేసి డిపాజిట్ చేసిన సొమ్ము తిరిగి వస్తుంది.
1.5 లక్షల డిపాజిట్‌లకు మించకూడదు:
సంవత్సరానికి రూ. 1.5 లక్షలు మించి వుండకూడదు. ఒక ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసినట్లయితే, ఆ పైన ఉన్న మొత్తం అధికంగా పరిగనిస్తారు. 1.5 లక్షలకు మించిన మొత్తంపై వడ్డీ లేదా ఎలాంటి పన్ను మినహాయింపు కూడా ఉండదు గమనించండి.
జాయింట్ అకౌంట్ రూల్:
ఇది కేవలం ఒక్కరే తీసుకోవాలి. ఒక వ్యక్తి ఎవరితోనూ జాయింట్‌గా లేదా జాయింట్‌గా ఖాతాను తెరవలేరు.
15 సంవత్సరాల తర్వాత ఏం చెయ్యాలంటే..?
పీపీఎఫ్ ఖాతాను 15 సంవత్సరాల తర్వాత అపరిమిత కాలానికి పొడిగించవచ్చు. దాని గురించి పోస్టాఫీసుకు చెప్పకపోయినా, ఎక్స్టెండ్ చెయ్యకపోయినా అది సక్రమంగా లేని వర్గంలోకి వస్తుంది.