క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్: ఐపీఎల్ 2022 షెడ్యూల్ ఫిక్స్..!

క్రికెట్ లవర్స్ కు మరో గుడ్ న్యూస్. ఐపీఎల్ 2022 షెడ్యూల్ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ ఇండియాలోనే జరుగుతునందని ఇటీవల నిర్వహకులు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రానున్న వేసవిలో ప్రపంచం మొత్తం ఐపీఎల్ ను ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. గతంలో 8 టీములకు తోడుగా కొత్తగా మరో రెండు టీములు రానుండటంతో ఈసారి 10 టీములతో ఐపీఎల్ జరుగబోతోంది. సారి లక్నో, అహ్మదాబాద్ జట్లు కొత్తగా రానున్నాయి.

అయితే ఎప్రిల్ 2, 2022 న ఐపీఎల్-15 అట్టహాసంగా ప్రారంభం కానున్నట్లు షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 60 రోజులు జరిగే ఐపీఎల్ టోర్నీలో.. 10 జట్లు 74 మ్యాచులు జరుగనున్నాయి. ఐపీఎల్ ఫైనల్ జూన్ 4 లేదా 5న జరుగనున్నట్లు తెలుస్తోంది. టోర్నమెంట్ ఓపెనింగ్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనున్నట్లు తెలుస్తోంది.