షాకింగ్.. సాహో చిత్రానికి ప్రభాస్ పారితోషికం రూ.100 కోట్లట..?

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సాహో మూవీ ఎట్టకేలకు మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ప్రభాస్, శ్రద్ధాకపూర్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సాహో మూవీ ఎట్టకేలకు మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ప్రభాస్, శ్రద్ధాకపూర్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అయితే మొదట్లో ఈ మూవీని ఆగస్టు 15న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వల్ల ఈ మూవీని ఆగస్టు 30వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు సుజిత్ ఇటీవలే ప్రకటించారు.

అయితే సాహో మూవీ కోసం ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయం ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ మూవీని రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. ప్రభాస్ ఈ మూవీకి గాను రూ.100 కోట్ల భారీ పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే గనక నిజమైతే భారత్‌లో అత్యధిక పారితోషిం తీసుకునే నటుల్లో ఒకరిగా ప్రభాస్ పేరు రికార్డులకెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

కాగా సాహో మూవీకి గాను రూ.100 కోట్ల పారితోషికాన్ని ఒకేసారి కాకుండా.. రెమ్యునరేషన్, షేర్ కలిపి ప్రభాస్ తీసుకోనున్నాడట. అంటే.. కొంత రెమ్యునరేషన్ ఎలాగూ ఇస్తారు. ఇక మూవీ సక్సెస్ అయితే దాంతో వచ్చే లాభాల్లో ప్రభాస్ కొంత షేర్ తీసుకుంటాడన్నమాట. ఈ క్రమంలో రెమ్యునరేషన్, షేర్ కలిపి ప్రభాస్ మొత్తం రూ.100 కోట్ల పారితోషికం తీసుకుంటాడని టాక్ వినిపిస్తోంది. మరి ఈ మూవీ విడుదలైతే కానీ.. ఆ వివరాలు తెలియవు. అప్పటి వరకు అందరమూ ఉత్కంఠగా ఎదురు చూడాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version