కొత్త సంవత్సరం ప్రారంభంలో భక్తులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి పొటెత్తారు. దీంతో భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. స్వామి వారి దర్శనం కోసం చాలా మంది భక్తులు క్యూ లైన్లలో వేచిచూస్తున్నారు.
అయితే, భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లను సైతం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, గుట్టపైకి వెళ్లేందుకు ప్రభుత్వం నడిపిస్తున్న బస్సులు సరిపోవడం లేదని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ బస్సులు నడిపించాలని భక్తులు కోరుతున్నారు.