ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సలార్ ..ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాలతో భారీ రికార్డులు సృష్టించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఈ సినిమాతో కన్నడ ఇండస్ట్రీ పేరు భారత చలనచిత్ర రంగంలో మారుమ్రోగింది. అంతకుముందు కన్నడ సినిమా ఇండస్ట్రీ అంటే ఇండియాలో చిన్నది అనే ఒక టాక్ ఉండేది. కానీ కేజీఎఫ్ సృష్టించిన రికార్డులు కన్నడ ఇండస్ట్రీకి మంచి పేరుని తీసుకొచ్చాయి.
ఈ సినిమాతో అటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాటు హీరో యష్ కి కూడా మంచి గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే బాహుబలి తర్వాత వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తుండడంతో సలార్ ఇప్పుడు అందరికీ ప్రెస్టేజియస్ ప్రాజెక్టుగా నిలిచింది. అయితే ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా తీయాలని ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. అందులో భాగంగానే సెప్టెంబర్ 28వ తేదీన మొదటి భాగం విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
మరి కొద్ది రోజుల్లో టీజర్ కూడా రిలీజ్ అవుతుందని భావించారు. అయితే ఇలాంటి సమయంలోనే సీజీ వర్క్ విషయంలో , అవుట్ పుట్ విషయంలో డైరెక్టర్ సంతృప్తి చెందకపోవడంతో సినిమా ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే సలార్ వాయిదా పడడంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతుండడం తో ఎట్టకేలకు ప్రభాస స్పందిస్తూ.. ఏ టైంలో వచ్చినా చాలా పెద్ద హిట్ అవుతుంది . ముఖ్యంగా స్టోరీ యాక్షన్ సీన్లు సినిమాకే హైలెట్గా నిలవనున్నాయి. గ్రాఫిక్స్ వర్క్ పూర్తయ్యకే నెమ్మదిగా రిలీజ్ చేస్తాము. ఈ టైంలో మనకి సినిమా రిజల్ట్ చాలా ముఖ్యం. టైం తీసుకున్నా పర్లేదు కానీ అవుట్ ఫుట్ ఇవ్వాలి అని మేకర్స్ తో ప్రభాస్ చెప్పారట అందుకే సినిమా వాయిదా పడినట్లు సమాచారం.