ప్రభాస్ ‘సాహో’ రివ్యూ : సాహో అనాల్సిందే

-

టైటిల్‌: సాహో
న‌టీన‌టులు: ప‌్ర‌భాస్‌, శ్ర‌ద్ధాక‌పూర్‌, జాకీష్రాప్‌, నీల్‌నితిన్ ముఖేష్‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీశ‌ర్మ త‌దిత‌రులు
జాన‌ర్‌: యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌ది
నేప‌థ్య సంగీతం: జిబ్రాన్‌
నిర్మాత‌లు: ప‌్ర‌మోద్ – వంశీ
క‌థ‌,ద‌ర్శ‌క‌త్వం: సుజీత్‌
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
ర‌న్ టైం: 172 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 30 ఆగ‌స్టు, 2019


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ బాహుబ‌లి త‌ర్వాత నేష‌న‌ల్ స్టార్ హీరోగా మారిపోవ‌డం… బాహుబ‌లి లాంటి ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీని మార్చిన సినిమా త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో సాహోపై స్కై రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి. రూ. 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటిస్తోంది.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, ట్రైల‌ర్లు సోష‌ల్ మీడియాలో ఊపేస్తున్నాయి. ప్ర‌పంచం మొత్తం సాహో నామ‌స్మ‌ర‌ణ చేస్తోంది. ఏకంగా ఐదు భాషల్లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమాకు యంగ్ డైరెక్ట‌ర్ సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌భాస్ స‌న్నిహితులు అయిన వంశీ – ప్ర‌మోద్ నిర్మించారు. శుక్ర‌వారం రిలీజ్ అవుతోన్న‌ సాహో ఇప్ప‌టికే ప్రీమియ‌ర్లు కంప్లీట్ చేసుకుంది. మ‌రి సాహో ఎలా ఉందో స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ : ముంబైలో అతి పెద్ద దొంగ‌త‌నం జ‌ర‌గుతుంది. రెండు వేల కోట్ల రూపాయ‌ల‌ను ఎవ‌రో కొట్టేస్తారు. ఈ రాబ‌రీ కేసు చేధించేందుకు పోలీసులు ఓ స్పెష‌ల్ ఆఫీస‌ర్ అశోక్ చ‌క్ర‌వ‌ర్తి (ప్రభాస్‌)ను నియ‌మిస్తారు. అశొక్‌కు సాయంగా కానిస్టేబుల్ గోస్వామి (వెన్నెల కిషోర్‌), డేవిడ్ (ముర‌ళీశ‌ర్మ‌) కూడా సాయం చేస్తుంటారు. అశోక్ కేసుని ఛేదిస్తుండగా చివ‌ర‌కు జై (నీల్ నితిన్ ముఖేష్‌)నే ఆ దొంగ అని తెలుస్తుంది. ఈ క్ర‌మంలోనే అశోక్ టీంలోకి అమృతా నాయ‌ర్ (శ్ర‌ద్ధాక‌పూర్‌)కి డ్యూటీ వేస్తాడు. క్ర‌మంగా అశోక్ ఆమెను ప్రేమ‌లోకి దింపుతాడు. ఈ క్ర‌మంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్స్‌కు కేరాఫ్ అయిన వాజీ సిటీలో బ్లాక్ బాక్స్‌లో కోట్ల రూపాయ‌లున్నాయన్న విష‌యం తెలుస్తుంది. దీనికోసం అటు పోలీసులు… అటు క్రిమిన‌ల్ టీం ప్ర‌య‌త్నాలు చేస్తూ ఎవ‌రి ఎత్తులు వారు వేస్తుంటారు.

ఆ క్రిమిన‌ల్ సిటీ నాయ‌కుడు అయిన రాయ్‌(జాకీ ష్రాఫ్‌)ను ముంబైలో కొంద‌రు చంపేస్తారు. ఆయ‌న స్థానంలో డాన్ అయిన ఆయ‌న త‌న‌యుడు విశ్వాంక్‌(అరుణ్ విజ‌య్‌) ఎంట్రీ ఇచ్చి తండ్రిని చంపిన వాళ్ల‌ను చంపేందుకు కాచుకుని ఉంటాడు. ఈ టైంలో ఎవ్వ‌రూ ఊహించ‌ని విషయాలు ?  ట్విస్టుల మీద ట్విస్టులు వ‌స్తుంటాయి. ఈ క‌థ‌లో సిద్ధార్థ‌రాయ్ సాహో ఎవ‌రు ?  అశోక్‌కు రాయ్‌కు లింకేంటి ?  అస‌లు బ్లాక్ బాక్స్‌లో ఉన్న సీక్రెట్ ఏంటి ?  వాజీ సిటీలో ఉన్న గ్యాంగ్ ఎలా అంతం ? అవుతుంది ?  చివ‌ర‌కు ఈ క‌థ‌లో విల‌న్లు ఎలా హీరోలయ్యారు ?  హీరోలు ఎలా ?  విల‌న్లు అయ్యార‌న్న‌దే సాహో క‌థ‌.

విశ్లేష‌ణ : ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరికి మన సినిమాలు హాలివుడ్ స్థాయి యాక్షన్ సినిమాలుగా లేవేంటనే భాద తొలగిపోతుంది. యాక్షన్ కి అత్యంత ప్రాధాన్యతని ఇస్తూ ఆద్యాంతం తెరకెక్కించిన ఈ సినిమా నభూతో నభవిష్యతనే చెప్పాలి. ఈ సినిమా కధనంలోకి వెళ్తే.. ఫస్టాఫ్లో ప్రభాస్ ఇంట్రడక్షన్ ఓ రేంజ్ లో ఉంటుంది. ప్రభాస్ పాత్రను దర్శకుడు చాలా చక్కగా తీర్చిదిద్దాడు. ముంబైలో జరిగిన అతిపెద్ద చోరీ ని ఛేదించడానికి ముంబై పోలీస్ ఓ అండర్ కవర్ ఆఫీసర్ ను నియమిస్తుంది. సాదాసీదా దొంగతనాలు చేస్తూ మాఫియాకి సాయం చేసే పాత్రలో అశోక్ కనిపిస్తాడు. అయితే అశోక్ ని ఓ కేసులో పట్టుకున్న అమృతా నాయర్ ని చూసిన అశోక్ ప్రేమించటం మొదలు పెడతాడు. కట్ చేస్తే..

అమృత కూడా ఒకానొక సమయంలో అశోక్ ని ఇష్ట పడటం మొదలు పెడుతుంది. కానీ ఆమె పోలీస్ అవ్వడంతో అశోక్ దొంగతనాలు చేస్తుండటంతో ఇద్దరు ఎప్పటికీ ఒకటి కాలేరని ఆమె వారిస్తుంది. ఈ క్రమంలోనే ఇంటర్వెల్ ముందు వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్ లో అమృత, అశోక్ దూరమవుతారు. అయితే ఇంటర్వెల్ ముందు ప్రేక్షకులకి అదిరిపోయే ట్విస్ట్ ఇస్తాడు దర్శకుడు.

ఫస్టాఫ్ సినిమా అంతా యాక్షన్ సన్నివేశాలతో అదిరిపోయే ట్విస్ట్ లతో అద్భుతంగా ప్రేక్షకులకు చేరువ అవుతుంది. అయితే సెకండాఫ్ మొదలవగానే అమృతం దూరం చేసిన ముఠా ని టార్గెట్ గా చేసుకుని వారిని అంతమొందించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు అశోక్. ఈ సందర్భంలో అశోక్ ఎవరు అనే అసలు విషయం తెలుస్తుంది. ఆ తరువాత మాఫియాని అంతమొందించే క్రమంలో లో వచ్చే యాక్షన్ సీన్లు హై వోల్టేజ్ కి ప్రేక్షకులు తీసుకెళ్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులని తల తిప్పుకోనివ్వవు. దాదాపు 30 నిమిషాలు సినిమాలో లీనమై పోయే లా చేస్తుంది. అనంతరం సినిమా ముగుస్తుంది.

న‌టీన‌టుల విశ్లేష‌ణ

అభిమానుల అంచనాలని ఏ మాత్రం చెక్కు చెదరనివ్వకుండా ప్రభాస్ ఓ రేంజ్ లో నటించాడు. బాహుబలి తరువాత చాలా గ్యాప్ తరువాత చేసిన సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలని ప్రభాస్ వమ్ము చేయలేదనే చెప్పాలి. యాక్షన్ సీన్లలో ప్రభాస్ నటన కళ్ళు చెదిరేలా ఉంటుంది. ఈ సినిమాకి ప్రభాస్ ఎంతగా కష్టపడ్డాడో అర్ధమవుతుంది సినిమా చూసిన వారికి. ఇక శ్రద్దా కపూర్ పాత్రలో ఒదిగిపోయింది. ప్రభాస్ తో పోటీగా ఆమె నటించింది. కమెడియన్ గా వెన్నెల కిషోరే న్యాయం చేశాడు. బాలీవుడ్ నటులు వారి వారి పాత్రలకి న్యాయం చేశారు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ప‌నితీరు

ఒక చిన్న సినిమాని తీసి భంపర్ హిట్ కొట్టిన దర్శకుడు సుజిత్. తన రెండో సినిమా భారీ స్థాయిలో తీసి ఎలా సక్సెస్ అవుతాడో అంటూ అందరూ ఆత్రుతగా చూశారు. ఎవరి అంచనాలు ఒమ్ము చేయకుండా హాలివుడ్ స్థాయిలో తెలుగు సినిమాని తెరకెక్కించాడు సుజిత్. జక్కన్న తరువాత తెలుగు సినిమాని ఆ స్థాయిలో తీసుకెళ్ళిన ప్రతిభ సుజిత్ కి దక్కుతుంది. ఆర్. మది ఫోటోగ్రఫి సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ ని చాలా అద్భుతంగా చూపించాడు. అయితే సినిమాకి సంగీత దర్శకులు ఐదుగురు కావడంతో కొద్దిగా తేడా కొట్టిందనే చెప్పాలి. బీజీయం మాత్రం రోమాలు నిక్కపొడుచుకునేలా చేసిసింది.

ప్ల‌స్ పాయింట్స్ (+

– ఇంటర్వెల్ బ్యాంగ్‌, సినిమాటోగ్రఫీ, కళ్ళు చెదిరే విజువల్స్, నేపథ్య సంగీతం.

మైన‌స్ పాయింట్స్ (-)

– ప‌్లాట్‌ నెరేషన్, ఆకట్టుకోని లవ్ ట్రాక్, డైలాగుల్లో మిస్ అయిన పంచ్‌, తెలుగు నేటివిటీకి దూరం ఉన్న‌ట్టు ఉండ‌డం

ఫైన‌ల్‌గా… ప్రభాస్ సాహో ని చూసి సాహో అనాల్సిందే.

సాహో manalokam.com రేటింగ్ : 3/ 5

Read more RELATED
Recommended to you

Latest news