ఆ హీరోయిన్ తో ప్రభాస్ సిన్సియర్ లవ్.. అనుష్క కాకుండా ఆమె ఎవరబ్బా..!

-

బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ కు తగినట్టుగా చేస్తున్న సినిమా సాహో. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది.

సాహో సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న జాన్ సినిమాకు సంబందించి ఎక్స్ క్లూజివ్ న్యూస్ బయటకు వచ్చింది. 1960, 70 కాలంలో జరిగే ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ప్రెజెంట్ డేస్ లో కూడా సినిమా నడుస్తుందట. సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. అందులో ఒకటి ప్లే బోయ్ రోల్ కాగా మరోటి సిన్సియర్ లవర్ గా నటిస్తున్నాడట.



సిన్సియర్ లవర్ గా ప్రభాస్ పూజా హెగ్దె ప్రేమను పొందాలని చూస్తాడట. సినిమాలో మరో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుందని తెలుస్తుంది. 2020 సెకండ్ హాఫ్ లో ఈ సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. మరి సాహో, జాన్ ప్రభాస్ సినిమాల లిస్ట్ చూస్తుంటే బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారెంటీ అనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news