ఉపాసన డెలివరీ డేట్ వచ్చేసిందోచ్.. మెగా వారసులు ఎంట్రీ..!

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇప్పుడు మహర్దశ పట్టుకుందని చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ దక్కించుకున్న రాంచరణ్ గత ఏడాది మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్తను కూడా తెలియజేశారు. రామ్ చరణ్, ఉపాసనలకు పెళ్లి అయ్యి పది సంవత్సరాలు దాటినప్పటికీ కూడా పిల్లలు లేకపోవడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. అయితే వాటన్నింటిని దాటుకుంటూ మెగా అభిమానులు కూడా దీటైన సమాధానం చెప్పుకొస్తూ వచ్చారు.

ఉపాసన కూడా ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా యాంకర్లు ఈ విషయం గురించే ప్రశ్నలు అడిగినా సరే ఆమె ఏ మాత్రం భయపడలేదు. పిల్లలు లేకుంటే ఎవరికైనా ఇలాంటి సంఘటనలు రావడం సహజమే కానీ ఉపాసన వాటిని ధైర్యంగా ఎదుర్కొని మరి అడిగిన వారికి గట్టిగా సమాధానం చెబుతూ వచ్చింది. ఇకపోతే ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి నోటి నుండి తాను తాతను కాబోతున్నాను అంటూ శుభవార్త ప్రకటించారు. అప్పటినుంచి మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇప్పుడు తాజాగా ఉపాసన డెలివరీ డేట్ కూడా వచ్చేసింది. ఉపాసన వచ్చే నెలలోనే డెలివరీ కాబోతోందట. అయితే డెలివరీని అమెరికాలో చేయిద్దామని రామ్ చరణ్ అనుకుంటుంటే అందుకు ఉపాసన ఒప్పుకోవడం లేదని హైదరాబాద్లోని తమ అపోలో హాస్పిటల్ లోనే ఆమె డెలివరీ చేయించుకుంటానని చెప్పిందట. అందుకే వచ్చే నెలలో హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో ఆమె డెలివరీ చేయించుకోబోతుందని సమాచారం. ఆమె డెలివరీ కోసం ఏకంగా ఒక ఫ్లోర్ మొత్తాన్ని బ్లాక్ చేశారట. ప్రపంచంలోని అత్యుత్తమ గైనకాలజిస్ట్లు ఉపాసన డెలివరీ అయ్యే 24 గంటలు ముందే ఇండియాకి రాబోతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news