Pragathi: మామిడి తోటలో ప్రగతి..చీరకట్టులో హొయలు పోతున్న నటి!

-

టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ లవర్స్ అందరికీ ఈమె గురించి తెలుసు. ఆన్ స్క్రీన్ లో సంప్రదాయ బద్ధమైన పాత్రలను ఈమె పోషించినప్పటికీ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం చాలా మోడ్రన్ గా ఉంటుంది. బాడీ పార్ట్ పై టాటూ వేయించుకోవడంతో పాటు ఊర మాస్..నాటు డ్యాన్స్ స్టెప్పులు వేసి పిచ్చెక్కిస్తుంటుంది.

ఈమె డ్యాన్స్ వీడియోలు బోలెడన్ని సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ‘వాతి కమింగ్’ పాటకు ప్రగతి వేసిన స్టెప్పులు చూసి కుర్రకారు వావ్ అంది. ఇక ఇటీవల మోడ్రన్ డ్రెస్సు ధరించి తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది ఈ నటి.

సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటుంది నటి ప్రగతి. ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలు ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేస్తుంటుంది ఈమె. తాజాగా ప్రగతి..మామిడి తోటలో నడుచుకుంటూ వస్తున్న వీడియో ఒకటి షేర్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ లో హిందీ సాంగ్ ప్లే అవుతుండగా, అలా స్లో మోషన్ లో కొంగు సర్దుకుంటూ..ప్రగతి నడుచుకుంటూ వస్తున్నది. స్లీవ్ లెస్ రవిక, శారీ కంప్లీట్ రెడ్ కలర్ శారీలో అలా వయ్యారంగా నడుచుకుంటూ వస్తోంది.

pragathi photo shoot

‘‘జీవించండి..ప్రేమించండి..నవ్వండి’’ అనే హ్యాష్ ట్యాగ్ తో ‘‘మిమ్మల్ని ఏదైతే వింతగా చేస్తుందో అదే మీ బలం’’ అనే క్యాప్షన్ తో ఈ వీడియో షేర్ చేసింది ప్రగతి. ఇక ఈ వీడియోకు యాక్ట్రెస్ సోనాల్ చౌహాన్ లైక్ చేసింది. నెటిజన్లు ‘బ్యూటిఫుల్ , ఫైర్’ అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఓ నెటిజన్ మంచి మొబైల్ తీసుకోండి..వీడియో క్లారిటీగా రావడం లేదు అని పోస్టు పెట్టడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version