PRABHAS : “రాధే శ్యామ్” టీజర్ వచ్చేసింది..!

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా “రాధే శ్యామ్” చిత్రం టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ప్రభాస్ సూట్ వేసుకుని స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. అంతే కాకుండా ఇదివరకు ఎప్పుడూ చేయని పాత్రలో ప్రభాస్ నటించినట్టు కనిపిస్తోంది. ఈ సినిమా ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో కనిపిస్తున్నారు. టీజర్ లో ఐ యాం విక్రమాదిత్య అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

పిరియాడికల్ ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్ లో మాత్రం పూజా హెగ్డే ఎక్కడా కనిపించలేదు. టీజర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇక టీజర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతోకాలం నుండి వేచి చూస్తూ ఉండగా టీజర్ ను విడుదల చేసి చిత్ర యూనిట్ అభిమానులను సర్ప్రైజ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news