గాంధీభవన్‌ లోకి గాడ్సేలను దూరారు.. కాంగ్రెస్‌ నేతల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ భావలే : కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పై మరోసారి ఓ రేంజ్‌ రెచ్చి పోయారు. కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌ అయిన గాంధీ భవన్‌ లోకి గాడ్సేలను దూరారని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పై ఇన్‌ డైరెక్ట్‌ గా వ్యాఖ్యలు చేశారు కేటీఆర్‌. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ చార్జి… మాణిక్యం ఠాకూర్ 50 కోట్ల రూపాయలకు పిసిసి పదవిని అమ్ముకున్నారని సొంత పార్టీ నేతలే చేసిన విమర్శలపై ఇప్పటివరకు స్పందించలేదని చురకలు అంటించారు.

ఇప్పటి దాకా దాని పైన ఆయన మాట్లాడలేదన్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ అగ్ర తాంబూలం ఇస్తుందని… కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సీనియర్ నాయకులు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్పారని గుర్తు చేశారు కేటీఆర్‌. ఎన్నికల కమిషన్ సైతం తన రాజ్యాంగబద్ధమైన పరిధిని దాటి వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుందని ఫైర్‌ అయ్యారు… ఈటల రాజేందర్‌, రేవంత్‌రెడ్డి రహస్యంగా కలిశారని… అన్ని ఆధారాలున్నాయి, బీజేపీ-కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు కేటీఆర్‌.