గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రేమిస్తే హీరోయిన్..చూస్తే షాక్.?

-

భరత్, సంధ్య హీరో హీరోయిన్లుగా నటించిన కమర్షియల్ సక్సెస్ చిత్రం ప్రేమిస్తే. ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఏ రేంజ్ లో యువతను ఆకట్టుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సంధ్యకు ఎక్కువగా అవకాశాలు లభించాయి. అయితే ఆ సినిమాలు మాత్రం కమర్షియల్ గా విజయాన్ని సాధించలేకపోవడం గమనార్హం. కొన్ని సినిమాలలో చెల్లి రోల్స్ చేసిన సంధ్య కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకొని తన లుక్ ను పూర్తిస్థాయిలో మార్చేసింది. అర్జున్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న సంధ్య అప్పటినుంచి మీడియా కంట పడలేదు.

కానీ ఇప్పుడు ఈమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈమెను చూసిన ప్రతి ఒక్కరు కూడా రీల్ సంధ్యకు.. రియల్ సంధ్య కు చాలా తేడా ఉంది అని కామెంట్లు చేస్తున్నారు. అయితే అప్పటికి ఇప్పటికీ ఈమె పూర్తిస్థాయిలో మారిపోయారని మరి కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం సంధ్య తమిళ సినిమాలతో మళ్ళీ బిజీ అవుతున్నారు అని.. తెలుగు సినిమాలలో కూడా నటిస్తే బాగుంటుంది అని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదిక ద్వారా కోరుకుంటున్నారు.

కెరియర్ విషయంలో పక్క ప్లాన్ చేసుకొని రీ ఎంట్రీ ఇస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కెరియర్ విషయంలో సంధ్య ప్లానింగ్ ఏ విధంగా ఉందో ఇక తెలియాల్సి ఉంది. సరైన ప్రాజెక్టులను ఎంచుకొని మళ్ళీ రీఎంట్రీ ఇస్తే ఆమె సక్సెస్ తో తన కెరీర్ కొనసాగించడం ఖాయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ జనరేషన్ ఆడియన్స్ లో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది కాబట్టి కెరియర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తే సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version