సోషల్ మీడియాను ఊపేస్తున్న ప్రియా ప్రకాశ్..!

-

వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ తన అందంతో యూత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. ఒరు అధార్ లవ్ టీజర్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిన ప్రియా ప్రకాశ్ వారియర్ ఆ సినిమా తెలుగులో లవర్స్ డేగా రిలీజ్ అయ్యే సరికి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. లవర్స్ డే సినిమా ఫలితం ఎలా ఉన్నా ప్రియా ప్రకాశ్ కు ఛాన్సులు మాత్రం క్యూ కడుతున్నాయి. ఇక ప్రస్తుతం అమ్మడు రిట్జ్ మేగజైన్ కోసం ఇచ్చిన ఫోటో షూట్స్ తో మళ్లీ అదరగొడుతుంది.

లైట్ పింక్ కలర్ డ్రెస్ లో హాట్ లుక్స్ లో సోషల్ మీడియాని మరోసారి షేక్ చేస్తుంది ప్రియా ప్రకాశ్ వారియర్. ప్రస్తుతం నాని, విక్రం కుమార్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించనున్న ప్రియా ప్రకాశ్ అల్లు అర్జున్, త్రివిక్రం సినిమాలో కూడా ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది. మరి చూస్తుంటే ప్రియా ప్రకాశ్ కు తెలుగులో స్టార్ ఇమేజ్ వచ్చేలా ఉంది. మరి ఈ కన్నుగీటి కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన ప్రియా ప్రకాశ్ తెలుగులో ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version