వింక్ బ్యూటీ టాటూ పై చర్చ

-

మళయాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ఒరు ఆదార్ లవ్ సినిమా తెలుగులో రిలీజ్ కాబోతుంది. సినిమా తెలుగు వర్షన్ టైటిల్ గా లవర్స్ డే అని పెట్టారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ సినిమా ఆడియో వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. తనని మళయాళంలో ఎంతగానో అభిమానిస్తున్నారు కాబట్టి అక్కడ నుండి వచ్చిన ఈ సినిమా తెలుగులో ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో తాను ఈ వేడుకకు వచ్చినట్టు చెప్పారు.

అల్లు అర్జున్ సినిమాలకు కేరళలో మంచి గిరాకి ఉంది. అక్కడ యూత్ కు బన్ని మేనియా బాగా పనిచేస్తుంది. అందుకే అక్కడ సినిమాగా వచ్చిన ఒరు ఆదార్ లవ్ సినిమాను బన్ని చాలా సపోర్ట్ ఇస్తున్నాడు. అంతేకాదు వింక్ బ్యూటీ కన్నుగీటిన ఆ టీజర్ కు బన్ని రెస్పాన్స్ కూడా అప్పట్లో హాట్ న్యూస్ అయ్యింది. అప్పుడు కనుసైగలతో కుర్రాళ్లను వెర్రివాళ్లను చేసిన ప్రియా ప్రకాశ్ నిన్న జరిగిన ఆడియో వేడుకలో తన టాటూతో అందరిని సర్ ప్రైజ్ చేసింది.

మెడ కింద యద పైభాగాన ఉన్న ఆ టాటూని గమనిస్తే.. Carper Diem అని ఉంది. అయితే దాన్ని వెంటనే కనిపెట్టే పనిలో పడిన నెటిజెన్లు దాన్ని డీకోడ్ చేశారు. అదో లాటిన్ పదమని.. పూర్తి పదంగా ఉన్న Carpe diem quam minimum credula postero దాన్ని ప్రియా షార్ట్ గా అలా టాటూ వేయించుకుందని తెలుస్తుంది. అయితే దాని అర్ధం ఏంటంటే.. ప్రస్తుతంలో జీవించండి అనట.. పూర్తిగా చెప్పాల్సి వస్తే.. భవిష్యత్ పై చిన్నపాటి ఆశ నమ్మకంతో నేడు జీవించండి అని వస్తుందట. మరి వింక్ బ్యూటీలో ఫిలాసఫీ కూడా ఉందన్నమాట. కొత్త అమ్మాయే అయినా ఇంత పరిణితి ఉండటం మంచి విషయమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version