Priyanka Chopra : తమ కూతురి ఫోటో రివీల్ చేసిన ప్రియాంక..

-

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చొప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు తన హాట్‌ అందాలతో అందరినీ కనివిందు చేస్తుంది ఈ భామ. అయితే.. ప్రియాంకకు బేబీ బంప్‌ కూడా కనిపించలేదు. కనీసం తను ప్రెగ్నెంట్‌ అని కూడా ప్రకటించలేదు. అయినప్పటికీ.. ప్రియాంక చోప్రా తల్లయింది. ప్రియాంక చోప్రా, నిక్‌ జోనస్‌ దంపతులు సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు.

అయితే.. బిడ్డ పుట్టిన దాదాపు 100 రోజులకు మదర్స్‌ డే సందర్భంగా ప్రియాంక దంపతులు తమ కూతురిని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే..ఓ ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది ప్రియాంక చోప్రా.

లాస్‌ ఏంజిల్స్‌లోని రాడీ చిల్ట్రన్‌ ఆస్పత్రి లో తమ పాపాయికి చికిత్స అందించిన ప్రతీ వైద్యుడికి, నర్సులకు ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా కృతజ్ఙతలు చెప్పారు. మదర్స్‌ డే రోజున తమ కూతురు ఇంటికి చేరడంపై సంతోషం వ్యక్తం చేసిన ప్రియాంక.. కొన్నాళ్లుగా తాము అనుభవిస్తున్న ఒడిదుడుకుల గురించి ఆలోచించకుండా ఉండలేమని స్పష్టం చేసింది ప్రియాంక చోప్రా.

Read more RELATED
Recommended to you

Exit mobile version