అవినీతి పరుడైన విజయసాయిరెడ్డి దాంట్లో దిట్ట : మాణిక్కం ఠాగూర్

-

ఇటీవల ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే.. అయితే.. రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా.. హైదరాబాద్‌లో పలువురు మేధావులు, పత్రికా యజమానులతో సమావేశమయ్యారు రాహుల్. అయితే. ఇలా సమావేశం కావడాన్ని తప్పుబడుతూ రాహుల్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కౌంటర్ ఇస్తూ.. 22 కేసుల్లో నిందితుడైన విజయసాయికి రాహుల్ గాంధీ గురించి మాట్లాడే హక్కులేదని, రాహుల్ ప్రజాస్వామ్య బద్ధంగానే వారిని కలిశారని మాణిక్కం అన్నారు.

అర్ధ రాత్రి సమావేశాలు నిర్వహించే వారికి, అవినీతి పరులకే రాహుల్ సమావేశాల్లో కుట్ర కనిపిస్తుందని ఎద్దేవా చేశారు మాణిక్కం. మరోవైపు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌పైనా మాణికం ఠాగూర్ విమర్శలు గుప్పించారు. ‘ఆస్క్ కేటీఆర్’ పేరుతో మంత్రి నిన్న ట్విట్టర్‌లో ప్రశ్నలు, జవాబుల కార్యక్రమాన్ని నిర్వహించారు. మాణికం ఇందులో పలు ప్రశ్నలు గుప్పించారు. 2014లో రూ. 7.98 కోట్లుగా ఉన్న మీ ఆస్తులు 2018 నాటికి రూ. 41.82 కోట్లకు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. 2018-2023 నాటికి మీ సంపాదన లక్ష్యమేంటని, ఇన్ని ఆస్తులు ఎలా పెరిగాయో చెప్పాలని ప్రశ్నలు వర్షం కురిపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version