ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధం.. పుతిన్ ఆలోచన అదేనా.?

-

ఉక్రెయిన్ పై తగ్గేదేలే అంటున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. అయితే.. మేము కూడా తగ్గేదెలే అన్నట్లు ఉక్రెయిన్ కూడా వ్యవహరిస్తోంది. నాటో దేశాల నుంచి ఆయుధాలు వస్తుండడంతో.. రష్యా దాడులను తిప్పికొడుతోంది ఉక్రెయిన్ సైన్యం.. అయితే.. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ఓటమికి గుర్తుగా రష్యాలో ప్రతి ఏడాది మే 9 న ‘విక్టరీ డే’ జరుపుకుంటారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో పాల్గొననున్న పుతిన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దాదాపు 11 వారాలుగా ఉక్రెయిన్‌తో జరుగుతున్న పోరును పూర్తిస్థాయి యుద్ధంగా మారుస్తున్నట్టు ఆయన ప్రకటించే అవకాశం ఉందని స్థానిక మీడియా సంస్థలు అంటున్నాయి.

అలాగే ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నాజీలపై పోరుగా అభివర్ణిస్తూ వెంటనే సైనిక బలాల్లో చేరాలంటూ పౌరులకు పిలుపునిచ్చే అవకాశం కూడా ఉందని, దీంతో మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద నేడు ఆయన చేయనున్న ‘విక్టరీ డే’ ప్రసంగంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, నాజీయిజం మళ్లీ పురుడుపోసుకోకుండా అడ్డుకుందామని అజర్‌బైజాన్, ఆర్మేనియా, బెలారస్, కజఖ్‌స్థాన్, కిర్గిజిస్థాన్, తజకిస్థాన్ తదితర కామన్‌వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ దేశాల ప్రజలకు పుతిన్ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version