‘ఏజెంట్‌’ ఓటీటీ రిలీజ్‌పై మరోసారి చర్చ.. నిర్మాత క్లారిటీ ఇదే

-

టాలీవుడ్ యంగ్‌ హీరో అక్కినేని అఖిల్‌ నటించిన ‘ఏజెంట్‌’ సినిమా వచ్చి ఏడాది అవుతోంది. అయినా ఇంకా ఇది ఓటీటీలోకి రాలేదు. ఇప్పటికే పలుమార్లు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటూ పలు డేట్లు కూడా రివీల్ చేశారు. కానీ మళ్లీ ఏమైందో వెనక్కి తగ్గారు. అయితే తాజాగా కొందరు నెటిజన్లు మూవీ టీమ్‌ను ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. దీనిపై ఈ చిత్ర నిర్మాత అనిల్‌ సుంకర స్పందించారు.

‘ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీలివ్‌ కొనుగోలు చేసింది. ఇప్పటికే ఈవిషయాన్ని చాలాసార్లు చెప్పాను. అతి త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశముంది’ అని తెలిపారు. మొదట ఈ సినిమాను గతేడాది మే 19న ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ప్రకటించినా.. కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. అఖిల్‌ రిక్కీ అలియాస్‌ రామకృష్ణ పాత్రలో కనిపించిన ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌లో ఆయన సరసన సాక్షి వైద్య నటించింది. ప్రముఖ కథానాయకుడు మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news