ఎట్ట‌కేల‌కు రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన‌ దిల్‌రాజు.. ఏం చేప్పారో తెలుసా..?

-

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి అందులో సినిమాలు నిర్మించాడు దిల్ రాజు. చాలా చిన్న వయసులోనే నిర్మాతగా మారిన ఈయన ఇప్పటికే 25 సినిమాలు మైలురాయిని కూడా అందుకున్నాడు. అయితే గ‌త కొంత కాలంగా దిల్ రాజు రెండో పెళ్ళికి సిద్ధమైనట్టు జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మద్యే అయన పెళ్లి పై వార్తలు ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి. అమ్మాయి ఎవ‌రు? దిల్‌రాజుతో ఎప్ప‌టి నుంచి ప‌రిచ‌యం? ఇద్ద‌రూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు… ఇదే గోల‌. అయితే దీనిపై ఎవరూ ముందుకొచ్చి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఖండించడం లేదంటే నిజమే అయ్యుంటుంది అంటున్నారు అభిమానులు.

వాస్త‌వానికి మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్యం కారణంతో మరణించారు. అప్పటి నుంచి దిల్ రాజు ఒంటరిగానే ఉంటున్నారు. దీంతో దిల్ రాజును మరో పెళ్లి చేసుకోవాలని సన్నిహితులు సలహాలు ఇచ్చారని, అందుకే ఆ వైపు ఆలోచించి దిల్ రాజు పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎట్ట‌కేల‌కు దీనిపై దిల్ రాజు స్పందించారు. నేను ఇంకా రెండో పెళ్లి చేసుకోలేదు. ఒకవేళ చేసుకునే ఉద్దేశ్యం ఉంటే అందరి సమక్షంలో చేసుకుంటాని స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక ఇంగ్లీష్‌ పేపర్‌లో వచ్చిన కథనం అని జస్ట్ పుకారు వివరణ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version